సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి

Advertisements

<p>సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది&period; రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి&period; ఈ ఘటనతో విద్యార్థులు&comma; తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది&period; ఇటీవల సీబీఎస్‌ఈ 12à°µ తరగతి పరీక్షల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు&period; తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడంతో&comma; విద్యార్థులకు స్కాన్‌ చేసిన జవాబు పత్రాల కాపీలు అందించి రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించింది బోర్డు&period; అయితే రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్న పోర్టల్‌పైనే సైబర్‌ దాడి జరగడంతో చెల్లింపుల్లో తీవ్ర అవకతవకలు కనిపించాయి&period; సాధారణంగా చెల్లించాల్సిన ఫీజుకు బదులుగా కొందరికి 68 వేల రూపాయల వరకు వేర్వేరు మొత్తాలు చూపించినట్లు అధికారులు తెలిపారు&period;<br &sol;>&NewLine;ఈ సమస్య ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్‌ గేట్‌వేతో అనుసంధానమైన వ్యవస్థలోనే తలెత్తినట్లు వెల్లడించారు&period; ఘటనపై అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు చేపట్టగా&comma; సాంకేతిక సమస్య పరిష్కారానికి ఐఐటీ మద్రాస్‌&comma; ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది&period;మరోవైపు ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానానికి సంబంధించి మొత్తం 20 జవాబు పత్రాలు తారుమారైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి&period; బాధిత విద్యార్థులను సంప్రదించి సరైన జవాబు పత్రాలను అందించినట్లు తెలిపాయి&period;దాదాపు 98 లక్షల జవాబు పత్రాలకు సంబంధించిన 40 కోట్లకు పైగా పేజీలను స్కాన్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు&period; అందులో సుమారు 68 వేల పత్రాల్లో నాణ్యత సమస్యలు గుర్తించడంతో వాటిని మళ్లీ స్కాన్‌ చేసినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.