రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం

Advertisements

<p>రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది&period; చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు&period; చురు&comma; బికనేర్‌&comma; శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్‌ అల్లకల్లోలం సృష్టించింది&period; ఇసుక తుపాను వీధులను కమ్మేసింది&period; భారీ దుమ్ము కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది&period; సోషల్‌ మీడియాలో దుమ్ము తుపాను సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి&period;<br &sol;>&NewLine;వీధుల గుండా బలమైన ఈదురుగాలులు&comma; దట్టమైన దుమ్ము మేఘాలు కనిపించాయి&period; దీంతో ఆకాశం ముదురు నారింజ-గోధుమ రంగులోకి మారిపోయింది&period; ఒక్కసారిగా ఇసుక తుపానుతో ప్రయాణికులు స్థానికులు ఇళ్లలోనే ఆశ్రయం పొందారు&period; ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి&period; ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండల తర్వాత బలమైన గాలులు&comma; దుమ్ము తుపానులు ముంచెత్తుతున్నాయి&period; కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎడారి వేడి గాలులు పరస్పరం చర్య జరిపినప్పుడు&period;&period; ముఖ్యంగా రుతుపవనాల ముందు వచ్చే ముందు రాజస్థాన్‌లో ఇటువంటి దుమ్ము తుపానులు సహజమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period; ఇసుక తుపాను కారణంగా ప్రాణ&comma; ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని&period;&period; తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో అనవసరమైన ప్రయాణాలను చేయొద్దని&period;&period; వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలిపారు&period; రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు&comma; మెరుపులతో కూడిన ఈదురుగాలులు&comma; దుమ్ము లేచే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..