వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Advertisements

<p>కారుణ్య నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది&period; వాటి విషయంలో వివాహితురాలైన కుమార్తెను మినహాయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది&period; ఈ నియామకాలకు సంబంధించి కుటుంబ నిర్వచనంలో వివాహితురాలైన కుమార్తె భాగం కాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది&period; అర్హత ఉన్న కుమార్తెకు&period;&period; పెళ్లయిందన్న కారణాన్ని సాకుగా చూపి కారుణ్య నియామకాన్ని నిరాకరించడం సరికాదని బాంబే&comma; కర్ణాటక హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది&period; కారుణ్యం ఆధారంగా తనకు ఫెయిర్ ప్రైస్‌ షాప్ డీలర్ లైసెన్స్ ఇప్పించాలంటూ ఒక మహిళా పిటిషనర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు&period; కుటుంబ నిర్వచనం నుంచి వివాహితురాలైన కుమార్తెను పక్కనపెడుతూ 2019లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆమె సవాలు చేశారు&period; తనకు వివాహం జరిగినప్పటికీ&period;&period; దివ్యాంగురాలైన సోదరిని చూసుకుంటూ&comma; తల్లితో కలిసి ఆ దుకాణాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు&period; తల్లి మరణం తర్వాత ఆమె లైసెన్స్‌కు దరఖాస్తు చేయగా&period;&period; అధికారులు తిరస్కరించారు&period; ప్రభుత్వ ఆదేశాలనే అలహాబాద్ హైకోర్టు సమర్థించగా&period;&period; ఆ తీర్పును సుప్రీం పక్కనపెట్టింది&period; ఆమెకు లైసెన్స్ నిరాకరిస్తూ జారీ చేసిన ఆదేశాలను తోసిపుచ్చింది&period; నాలుగువారాల్లో ఆమెకు లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.

కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.