భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది, అందుకే ఎక్కువగా తీహార్ జైలు (Tihar Jail) అని అంటుంటారు. తీహార్ జైలు దక్షిణ ఆసియాలోనే అతిపెద్దకారాగార ప్రాంగణము. ఢిల్లీ లోని చాణక్యపురి నుండి 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరసాల అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయమిచ్చింది. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అని కూడ పేరు పొందింది. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులున్నాయి. కాని ఈ జైలు ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది. ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో ఉంచబడ్డారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు. 1986 మార్చి 16న క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అయినా మళ్లీ దొరికిపోయాడు. పన్నేండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డవారిలో కీలక నిందితుడు అఫ్జల్ గురును ఇక్కడే ఉరితీశారు. మాజీప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు.
ఇది చదవండి: పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి