బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలి రోజు ఈడీ విచారణ ముగిసింది. తొలి రోజే ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరెవరు డబ్బులు సమకూర్చారనే ఆధారాలను కూడా చూపిస్తూ ఆమెను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ. 192 కోట్ల సంగతి ఏమిటని అడిగారు. డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత… మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కాగా సాయంత్రం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది. కుటుంబ భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతించింది.
కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…
58