ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam Case)లో కవిత బెయిల్ పిటిషన్(Kavita Bail Petition) పై విచారణను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)నేటికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేడు తదుపరి విచారణ చేపట్టనున్నారు. కాగా, తన పిటిషన్లలో కవిత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె సవాల్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తదుపరి విచారణ జరగనుంది. కాగా, ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా ఉన్నాయని విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాది పలు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంలో పెండింగులో ఉండడంతో విచారణ ముందుకు సాగడం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు. అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41 ఏ ప్రకారం సమన్లు జారీ చేశారని విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. సీఆర్పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, ఆ తర్వాత 41 ఏ కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అలాగే జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం అంగీకరించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందన్నారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.
- మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు, జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు…
- అభివృద్ధితోనే మావోయిస్టుల అంతం..మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అభివృద్ధితోనే మావోయిజం అంతమవుతోందన్నారు. ఇప్పుడు మావో ఉద్యమం తుదిదశకు చేరిందన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న అమిత్‌షా ఓవైపు ఆపరేషన్…
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ..ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ.. రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రధాని మోదీ తో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.