ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam Case)లో కవిత బెయిల్ పిటిషన్(Kavita Bail Petition) పై విచారణను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)నేటికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేడు తదుపరి విచారణ చేపట్టనున్నారు. కాగా, తన పిటిషన్లలో కవిత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె సవాల్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తదుపరి విచారణ జరగనుంది. కాగా, ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా ఉన్నాయని విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాది పలు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంలో పెండింగులో ఉండడంతో విచారణ ముందుకు సాగడం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు. అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41 ఏ ప్రకారం సమన్లు జారీ చేశారని విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. సీఆర్పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, ఆ తర్వాత 41 ఏ కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అలాగే జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం అంగీకరించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందన్నారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.
- లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
- బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ మారిన 24 గంటల్లోనే ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో సుమారు పది లక్షల మంది తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జెన్ జీ యువత పెద్ద…
- పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ..పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడిన ఆయన సభలకు తాజాగా మార్గం సుగమమైంది. ఈ రోజు కోల్‌కతా, సెరంపూర్‌లలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 57027