Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..

మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..

by CVR NEWS
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు

మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మరమ్మతుల కోసం హైదరాబాద్ నుంచి మెదక్‌కు తీసుకొచ్చారు. రిపేర్ పూర్తయ్యాక డ్రైవర్, క్లీనర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. మాసాయిపేట వద్దకు రాగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును నిలిపివేసి, క్లీనర్‌ను అప్రమత్తం చేశాడు. ఇద్దరూ కిందకు దూకేసి, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మరమ్మతుల సమయంలో జరిగిన లోపమా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023217
Total views : 141555

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.