Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Crime అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్….

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్….

by Prakash
Tupran Police


అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన తూప్రాన్ పోలీసులు (Tupran Police)..

గత కొంత కాలంగా తూప్రాన్ పట్టణం, ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడుతున్న మహారాష్ట్ర కి చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను గురువారం నాడు తూప్రాన్ పోలీసులు (Tupran Police) చాకచక్యంతో పట్టుకున్నారని ఎస్పీ బాలస్వామి తూప్రాన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరి 17 న తూప్రాన్ లో ఫంక్షన్ కి హాజరు అయిన ఉప్పలపు శ్వేత అనే మహిళ తిరిగి హైదరాబాద్ కి వెళ్తుండగా టోల్ ప్లాజా వద్దకి రాగానే హ్యాండ్ బ్యాగ్ చుసుకొగ అందులో ఉన్న 12.5 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదని గమనించిన ఆమె తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మూడూ గ్రూప్ ల విడిపోయి దర్యాప్తు నిర్వహించారు.

12.5 తులాల బంగారం 6 మొబైల్ ఫోన్లు ఒక కార్ స్వాధీనం – ఎస్పీ బాలస్వామి

తూప్రాన్ బై పాస్ అవరణలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు మహారాష్ట్ర కి చెందిన మారుతి వెగనార్ కారులో అనుమానాస్పదంగా తిరుగుందడం గమనించి వారిపై నిఘా పెట్టి గురువారం నాడు వారి ఫోన్ నంబర్ కనిగుని ట్రాక్ చేసి పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు అని తెలిపారు. నిందితులు A1 వైశాలి విజయ్ సొలంకే A2 హినా కరణ్ రహదే, A3 జయాహ్రి అంకుష్, A4 విజయ్ బింరావు, A5 కరణ్ సంతోష్ లను విచారించగా వారి నుండి 12.5 తులాల బంగారం, 6 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి వెగనార్ కార్ స్వాధీనం చేసుకుని విచారించగా సంగారెడ్డి, సదాశివపేట రామాయం పేట అదే కాకుండా మహారాష్ట్ర కో కూడా ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలిందని తెలిపారు.

తూప్రాన్ పోలీసులకు అభినందనలు…

తూప్రాన్ పట్టణ మరియు ఇతర ప్రాంతాల్లో ఇటీవల ఇస్టనుసారంగా రెచ్చిపోతున్న ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను చాకచక్యంతో తో పట్టుకున్న డీఎస్పీ సోమ వెంకట్ రెడ్డి, సీఐ కృష్ణ ఎస్ఐ శివానందం ను వారి టీమ్ ను ఎస్పీ బాలస్వామీ అభినందించారు.

ఇది చదవండి : వేల కోట్ల అధిపతి కి రిజర్వేషన్ ఎందుకు – బాల్క సుమన్


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008620
Total views : 56965

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.