12
తెలంగాణలో జనాభా లెక్కలు ప్రారంభం కానుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఈ జనగణన నిర్వహిస్తున్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రక్రియ చేపడుతున్నారు. మే 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉండగా.. ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. రెండు దశల్లో డేటా సేకరణ జరగనుంది. 16 భాషల్లో అందుబాటులో ఉన్న పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్ ఓపెన్‌గా ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.




Total views : 56586