కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పై కాంగ్రెస్ ఎంపీ చామల స్పందించారు. మాయ మాటలు, పిట్ట కథలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిండు ఇప్పుడు కవిత తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారని ఎద్దేవా చేశారు. సమితి , సేన అనే పదం మారింది తప్ప వాళ్ళ రంగు మారదన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రజలను దోచుకున్నారన్నారని కవితానే ఒప్పుకుందన్నారు. తెలంగాణను దోపిడీ చేసి కుప్ప పోసి పంచుకునే దగ్గర పంచాయతీ రావటం వల్ల ఆమె కొత్త పార్టీ పెట్టారన్నారు. కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు..కవిత ఏకంగా 4 లక్షల ఉద్యోగాలని వాగ్ధానాలు చేస్తుందన్నారు. ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రేవంత్ రెడ్డి ని తిడితే మార్కులు రావన్నారు. సీఎం హిట్లర్ అయితే ఆర్టీసీ సమ్మె విరమించి చర్చలకు వస్తారా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల ఫ్యామిలీది దోచుకోవడం దాచుకోవడమేనన్నారు. పార్టీ పెట్టగానే సీఎం అవుతానంటే ప్రజలు నమ్మి ఓట్లు వేయరన్నారు.
కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పై ఎంపీ చామల స్పందన..
12
previous post





Total views : 56519