ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా… అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట చివరకు 7 వికెట్లకు 67 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆసీస్ విలవిల్లాడింది. ఏ దశలోనూ ఆసీస్ బ్యాటింగ్ కుదురుగా సాగలేదు.
ముఖ్యంగా, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దాడులకు నాయకత్వం వహించి, కంగారూ టాపార్డర్ ను కకావికలం చేశాడు. బుమ్రా 4 వికెట్లతో ఆతిథ్య జట్టు వెన్నువిరిచాడు. బుమ్రా విసిరిన బుల్లెట్ బంతులకు ఆస్ట్రేలియన్ల వద్ద సమాధానం లేకపోయింది. మరో ఎండ్ లో మహ్మద్ సిరాజ్ కూడా 2 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను దెబ్బతీశాడు. కొత్త కుర్రాడు హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేసిన 19 పరుగులే అత్యధికం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి