ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా… అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట చివరకు 7 వికెట్లకు 67 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆసీస్ విలవిల్లాడింది. ఏ దశలోనూ ఆసీస్ బ్యాటింగ్ కుదురుగా సాగలేదు.
ముఖ్యంగా, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దాడులకు నాయకత్వం వహించి, కంగారూ టాపార్డర్ ను కకావికలం చేశాడు. బుమ్రా 4 వికెట్లతో ఆతిథ్య జట్టు వెన్నువిరిచాడు. బుమ్రా విసిరిన బుల్లెట్ బంతులకు ఆస్ట్రేలియన్ల వద్ద సమాధానం లేకపోయింది. మరో ఎండ్ లో మహ్మద్ సిరాజ్ కూడా 2 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను దెబ్బతీశాడు. కొత్త కుర్రాడు హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేసిన 19 పరుగులే అత్యధికం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
- పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
- నీట్ పేపర్ లీక్‌పై పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212401