23
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో ముందుంటామని సీఎం చంద్రబాబు అడుగులు స్పష్టం చేశారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. అమరావతి..పోలవరం పూర్తి కావాలనీ…ప్రజల జీవన ప్రమాణాలుపెరుగాలని జగన్నాధస్వామి సన్నిధిలో చంద్రబాబు కోరుకున్నారు. జై జగన్నాధ్ అన్న నినాదాన్ని ఎత్తుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.





Total views : 212498