లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. లక్ష పూచికత్తు, 15వేల బాండ్ సమర్పించాలని కోర్టు సీఎం కేజ్రీవాల్ కు స్పష్టం చేసింది. కాగా దర్యాప్తునకు సహకరించాలని అధికారులు పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టులో ఈడీ సీఎం కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో రెండుసార్లు సమన్లను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తనకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ పిటీషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు ఇవాళ హాజరయ్యారు. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరగా… అనూహ్యంగా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఏపిలోఅధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి