కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission):
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్(Rajeev Kumar) .. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly), లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)పై కీలక ప్రకటన చేశారు. జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లో ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరిగిందని.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, వివక్ష లేకుండా నిజాయతీగా ఎన్నికలు జరపాలని వివిధ పార్టీలు కోరాయని రాజీవ్ కుమార్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కూడా కశ్మీర్ రాజకీయ పక్షాలు కోరాయని పేర్కొన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండాలని కూడా పార్టీలు సూచించాయని చెప్పారు. వలసదారులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరాయని సీఈసీ వివరించారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనాలని జమ్ము కశ్మీర్ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఇక, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ సరైన సమయంలో విడుదల చేస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: నా వయసు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ఫాలో అవ్వండి