నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు, ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్ప్రెస్ వే, మూసీ ప్రక్షాళనతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు క్లియరెన్స్లపై ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తుల వర్షం కురిపించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాలు పెంపు, ఉపాధి కల్పన, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.





Total views : 196903