మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్
యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2024 పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడి కూటమి ప్రధానంగా తలపడుతున్నాయి. మొత్తం 4 వేల 136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2 వేల 86 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. 2019లో 3వేల239 మంది అభ్యర్థులు పోటీ చేయగా… ఈసారి అభ్యర్థుల సంఖ్య ఏకంగా 28 శాతం పెరిగింది.దాదాపు 150 నియోజక వర్గాల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా టికెట్ దక్కని చాలా మంది నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఒక్క ముంబై నగరంలోనే ఏకంగా 30 వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా కు నో పర్మిషన్అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంధుల జట్టుకు భారత ప్రభుత్వం … భారత్-పాకిస్థాన్‌ల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ముప్పు ఉన్న దృష్ట్యా ఇండియా టీమ్‌ను పొరుగు దేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం…
- బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోడీ భేటీ..ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌ను కోరారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో నరేంద్రమోడీ భేటీ అయ్యారు. బ్రిటన్ ప్రధానితోనూ…
- దమ్ముంటే అసెంబ్లీకి రా..చూసుకుందాంకాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 66లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని.. ఇది ఒక చరిత్ర అని సీఎం…
- గుజరాత్ గులాం ఫై రేవంత్ రెడ్డి ఫైర్కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లూ కిషన్ రెడ్డిపైన కొంత గౌరవం ఉండేదని.. అది కూడా పోగొట్టుకున్నాడని మండిపడ్డారు. ఇక ఆయన తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్ కు వెళ్లిపోవాలని సూచించారు.…
- పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టుఏపీ డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది. వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి