ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య పోరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul) అభివర్ణించారు. ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్(Congress), మరోవైపు ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్న వారు మరోవైపు ఉన్నారన్నారు. దేశ విభజన కోరుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలోపేతం చేసి దేశ సమైక్యత కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన వారెవరు చరిత్రే సాక్షి గా నిలుస్తుందన్నారు.
ఇది చదవండి: తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు…
‘క్విట్ ఇండియా ఉద్యమం’ సమయంలో బ్రిటీష్(British) వారికి ఎవరు అండగా నిలిచారని ప్రశ్నించారు. భారతదేశ జైళ్లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు, దేశాన్ని విభజించే శక్తులతో రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారని నిలదీశారు. రాజకీయ వేదికలపై నుంచి అబద్ధాల వర్షం కురిపించినంత మాత్రాన చరిత్ర మారదని రాహుల్ ట్వీట్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి