Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన డీఎస్..!

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన డీఎస్..!

by Satya
DS admitted to the hospital due to illness

కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్(D. Srinivas) అనారోగ్యంతో ఆసుపత్రి(Hospital)లో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్(DS).. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇది చదవండి: పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త..

ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. ఈమేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న డీఎస్ తో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. కాగా, డీఎస్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Advertisements

You may also like

Our Visitor

019581
Total views : 91171

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.