60
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.