రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
RBI
ద్వైపాక్షిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత రిజర్వ్ బ్యాంకు(Reserve Bank of India) ఇండోనేషియా(Indonesia) తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ, బ్యాంక్ ఇండోనేషియా అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి. ‘సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీలు భారత రూపాయి, ఇండోనేషియా రూపాయ్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎంఓయూపై సంతకం చేయడం జరిగిందని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఇరుదేశాలకు చెందిన ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి సంబంధిత స్థానిక కరెన్సీలలో లావాదేవీలు జరపడానికి వీలు కలుగుతుందని తెలిపింది. ఈ ఎంఓయూపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ రూపాయి, ఇండోనేషియా రూపయ్యాను ప్రోత్సహించినట్లు అవుతుందని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రెసిడెన్షియల్ హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం..!
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90632