Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Business భార‌త రిజ‌ర్వ్‌ బ్యాంకుతో ఇండోనేషియా కీల‌క ఒప్పందం

భార‌త రిజ‌ర్వ్‌ బ్యాంకుతో ఇండోనేషియా కీల‌క ఒప్పందం

by Satya
Reserve Bank of India Indonesia

ద్వైపాక్షిక లావాదేవీల కోసం స్థానిక‌ క‌రెన్సీల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌త రిజ‌ర్వ్‌ బ్యాంకు(Reserve Bank of India) ఇండోనేషియా(Indonesia) తో కీల‌క ఒప్పందం చేసుకుంది. ఈ మేర‌కు ఆర్‌బీఐ, బ్యాంక్ ఇండోనేషియా అవ‌గాహ‌న ఒప్పందం పై సంత‌కాలు చేశాయి. ‘స‌రిహ‌ద్దు లావాదేవీల కోసం స్థానిక క‌రెన్సీలు భార‌త రూపాయి, ఇండోనేషియా రూపాయ్యాల‌ వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డానికి ఎంఓయూపై సంత‌కం చేయడం జరిగిందని ఆర్‌బీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. త‌ద్వారా ఇరుదేశాల‌కు చెందిన ఎగుమ‌తిదారులు, దిగుమ‌తిదారులు వారి సంబంధిత స్థానిక క‌రెన్సీల‌లో లావాదేవీలు జ‌ర‌ప‌డానికి వీలు క‌లుగుతుంద‌ని తెలిపింది. ఈ ఎంఓయూపై ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేషియా గ‌వ‌ర్న‌ర్ పెర్రీ వార్జియో సంత‌కాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భార‌తీయ రూపాయి, ఇండోనేషియా రూప‌య్యాను ప్రోత్స‌హించిన‌ట్లు అవుతుంద‌ని ఇరు దేశాల ప్ర‌తినిధులు పేర్కొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రెసిడెన్షియల్ హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం..!


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి          


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: