రెండో దశలో దేశవ్యాప్తంగా మొత్తం 88 పార్లమెంట్(Parliament) స్థానాలకు పోలింగ్..
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) షెడ్యూల్ విడుదల చేసి.. తొలి దశ పోలింగ్ నోటిఫికేషన్ రిలీజ్(Polling notification release) చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్.. తాజాగా రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెకండ్ ఫేజ్లో దేశంలోని 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో దేశవ్యాప్తంగా మొత్తం 88 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నేటి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ.
మే 13న నాలుగో దశలో పార్లమెంట్ ఎన్నికలు..
జమ్మూకాశ్మీర్(Jammu and Kashmir) మినహా మిగిలిన 11 రాష్ట్రాల్లో ఏప్రిల్ 5న నామినేషన్లు పరిశీలించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 6వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 26న రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు దశల్లో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలైనా ఏపీ, తెలంగాణలో మే 13న నాలుగో దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: Lok Sabha 2024: కాంగ్రెస్ ఏడవ జాబితా విడుదల..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి