మహ్మద్‌ఖాన్, ద్రౌపదిముర్ముపై సుప్రీంకోర్టు(Supreme Court)లో రిట్ పిటిషన్ దాఖలు..
కేరళ ప్రభుత్వం(Kerala Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్ అరిఫ్ మహ్మద్‌ఖాన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని కోరింది. యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు- 2022, కేరళ(Kerala) సహకార సంఘాల సవరణ బిల్లు-2022తోపాటు మరో మూడు బిల్లులు కలిపి మొత్తం 7 ఆమోదించిన అసెంబ్లీ వాటిని గవర్నర్‌కు పంపింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గవర్నర్ వాటిపై సంతకం పెట్టకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. దీనిని కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఆమోదించకపోవడానికి ఎలాంటి కారణం లేకుండానే రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తన రిట్‌పిటిషన్(Repetition)లో కోరింది. అరిఫ్‌ఖాన్(Arif Khan)పై పిటిషన్(Petition)లో గవర్నర్‌ను, గవర్నర్ కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొంది.
ఇది చదవండి: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన భారత్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి