భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

NawazSharif praises india

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై మరోమారు ప్రశంసలు కురిపించారు&period; పాక్ చుట్టూ ఉన్నా దేశాలు చంద్రుడిని అందుకుంటుంటే మనం మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు&period; రాజధాని ఇస్లామాబాద్‌లో తన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ కేడర్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు&period; దేశ ఆర్థిక దుస్థితి గురించి మాట్లాడుతూ దీనికి కారణం దేశమేనని పేర్కొన్నారు&period; మన పొరుగువారు చంద్రుడిని చేరుకున్నారు&period; మనం ఈ భూమ్మీదే ఎదగలేకపోతున్నాం&period; ఇది ఇలాగే కొనసాగదు అని చెప్పుకొచ్చారు&period; మన పతనానికి మనమే కారణమని&comma; లేదంటే ఈ దేశం ఈ పాటికి ఎక్కడో ఉండేదని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2013లో దేశం తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనమొచ్చి దానిని పరిష్కరించామని&comma; దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపి కరాచీలో శాంతి నెలకొల్పామని&comma; రహదారులు నిర్మించామని&comma; చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ వచ్చిందని&comma; అభివృద్ధిలో నూతనశకం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు&period; దేశంలో నెలకొన్న సంక్షోభాలకు ఎవరిని నిందించాలని&comma; మన కాళ్లను మనమే నరుక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు&period; తన ప్రభుత్వ హయాంలో దేశంలో ఆబ్‌పరా&comma; ఇస్లామాబాద్‌లో 2 పాకిస్థానీ రూపాయలకే రొట్టె లభించేదని&comma; కానీ ఇప్పుడది 30 రూపాయలకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.