నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం.

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం

Advertisements

<p>నీట్‌ యూజీ-2026 కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి&period; పరీక్షకు ముందు రాజస్థాన్‌లో కోచింగ్‌ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో ప్రశ్నా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు&period; దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు&period; దీనిలో పలు రాష్ట్రాల నెట్‌వర్క్‌à°² హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు దర్యాప్తు చేపట్టింది&period; లీకేజీ వార్తలను నీట్‌ నిర్వహించిన జాతీయ పరీక్ష సంస్థ కూడా కొట్టిపారేయకపోవటం గమనార్హం&period; ఈ నెల 3à°¨ జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్‌ అదనపు డీజీపీ విశాల్‌ బన్సాల్&comma; ఎస్‌ఓజీ అధికారులు వెల్లడించారు&period; ఈ మెటీరియల్‌ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు&period; దీనిని విద్యార్థులకు రూ&period;20వేల నుంచి రూ&period;2 లక్షల వరకు విక్రయించారని&comma; కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ&period;30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు&period; ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా&quest; లేక ఎవరైనా పేపర్‌ లీక్‌ చేశారా&quest; అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు&period; కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది&period; ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది&period; ఆ వ్యక్తి ఈ నెల 1à°¨ సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్‌ ఇచ్చాడని&period;&period; ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు&comma; కోచింగ్‌ నెట్‌వర్క్‌లు&comma; కెరీర్‌ కౌన్సిలర్లు&comma; పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు&period; ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్&comma; కెమిస్ట్రీ&comma; బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..