65
ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ కారును నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల నుంచి తమ ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఫాతిమానగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెప్పారు.