Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Crime ముగిసిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు….

ముగిసిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు….

by Prakash
CBI Court

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌పై ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్‌ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014829
Total views : 81104

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.