సర్కారు బడి సిబ్బంది, ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం.. ఆరేళ్ల చిన్నారిని తాళం వేసున్న తరగతి గదిలోనే ఆరు గంటలపాటు భయం భయంగా గడిపేలా చేసింది.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ప్రభావతి సుబ్రహ్మణ్యం దంపతుల కుమార్తె ఒకటో తరగతి. గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక పిల్లలందరూ వెళ్లిపోయారు. కానీ ఆ చిన్నారి బెంచి పై పడుకొని ఉంది. గమనించని సిబ్బంది తరగతి గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. రోజు సమయానికి ఇంటికి వచ్చే పాప ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పాఠశాల దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో గదిలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆమె కనిపించింది. సిబ్బంది కోసం వెతికినా అక్కడ లేకపోవడంతో.. తలుపులు బద్దలు కొట్టి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చిన్నరి తల్లిదండ్రులు వాపోయారు. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. తరగతి గదిలోనే చిన్నారి
68
previous post