ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. తరగతి గదిలోనే చిన్నారి

child alone in a classroom

Advertisements

&NewLine;<p> సర్కారు బడి సిబ్బంది&comma; ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం&period;&period; ఆరేళ్ల చిన్నారిని తాళం వేసున్న తరగతి గదిలోనే ఆరు గంటలపాటు భయం భయంగా గడిపేలా చేసింది&period;&period; కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది&period; స్థానికంగా నివాసముండే ప్రభావతి సుబ్రహ్మణ్యం దంపతుల కుమార్తె ఒకటో తరగతి&period; గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక పిల్లలందరూ వెళ్లిపోయారు&period; కానీ ఆ చిన్నారి బెంచి పై పడుకొని ఉంది&period; గమనించని సిబ్బంది తరగతి గదికి తాళం వేసి వెళ్ళిపోయారు&period; రోజు సమయానికి ఇంటికి వచ్చే పాప ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు&period; చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పాఠశాల దగ్గరికి వెళ్లారు&period; ఆ సమయంలో గదిలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆమె కనిపించింది&period; సిబ్బంది కోసం వెతికినా అక్కడ లేకపోవడంతో&period;&period; తలుపులు బద్దలు కొట్టి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు&period; ఉపాధ్యాయుడు&comma; సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చిన్నరి తల్లిదండ్రులు వాపోయారు&period; ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ఆంజనేయులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.