ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది…

Advertisements

<p>ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది&period; తాజాగా &OpenCurlyQuote;సికాడా’ అనే పేరుతో పిలవబడే BA&period;3&period;2 అనే కొత్త ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ వెలుగులోకి వచ్చింది&period; ఇది ఇప్పటికే 23కి పైగా దేశాలకు పాకినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ధృవీకరించాయి&period; ఈ వేరియంట్‌ను మొదటగా 2024 నవంబర్‌లో దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు&period; అయితే&comma; 2025 సెప్టెంబర్ నుండి దీని వ్యాప్తి వేగవంతమైంది&period; ప్రస్తుతం అమెరికాలోని 25 రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు&period; గత వేరియంట్లతో పోలిస్తే &OpenCurlyQuote;సికాడా’ వేరియంట్ లక్షణాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి&period; ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు మంట&comma; నొప్పి ప్రధానంగా కనిపిస్తోంది&period; ముక్కు బ్లాక్ అవ్వడం లేదా నీరు కారడం ఉంటుంది&period; అదేవిధంగా విపరీతమైన నీరసం&comma; ఒళ్లు నొప్పులు&comma; తలనొప్పి&comma; చలితో కూడిన జ్వరం&comma; పొడి దగ్గు ఉంటుందని వైద్యులు తెలిపారు&period; కొన్ని కేసుల్లో ఈ వేరియెంట్ సోకిన వారికి రుచి&comma; వాసన కోల్పోయే అవకాశం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ను &OpenCurlyQuote;వేరియంట్ అండర్ మానిటరింగ్’ కేటగిరీలో పెట్టారు&period; అంటే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి&period; ఇది వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉన్నప్పటికీ&comma; దీని వల్ల వచ్చే అనారోగ్యం స్వల్పంగా లేదా మధ్యస్థంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు&period; అయితే&comma; వృద్ధులు&comma; గర్భిణీలు&comma; ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; &OpenCurlyQuote;సికాడా’ వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే భిన్నంగా ఉండటం వల్ల&comma; ఇది టీకాలు తీసుకున్న వారిలో కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది&period; కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం&comma; శుభ్రత పాటించడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period; ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని&comma; కానీ అప్రమత్తత అవసరమని ప్రభుత్వం పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.

ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.