విటమిన్ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం – 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌందర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు.
Read Also..
Read Also..