సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ

Satyanarayana

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది&period; ఈ నెల 6న శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో మంత్రి పాల్గొన్నారు&period; ఈ యాత్రలోనే మంత్రి అస్వస్థతకు గురయ్యారు&period; దీంతో హుటాహుటిన మంత్రి బొత్సను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు&period; ఆయనను పరీక్షించిన వైద్యులు&period;&period; గుండెలో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు&period; వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు&period; హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణను చేర్పించగా&period;&period; శనివారం వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు&period; ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది&period; ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని&comma; బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు&period; నెల రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి బొత్స కుటుంబ సభ్యులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..