మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. నాలుగు రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నుంచి ప్రారంభించిన పాదయాత్ర బుధవారం ప్రొద్దుటూరు చేరుకుంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడుగా ఉన్న గుంటూరు జిల్లా వాసి కట్టెపోగు బసవరావు ఆ పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చెపట్టారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. మళ్లీ 2024లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని 2000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగే ఈ పాదయాత్ర మూడు నెలలు కొనసాగు తుందని ఆయన చెప్పారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కలిసిన అనంతరం 5వ రోజు పాదయాత్ర ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఆయనకు మద్దతుగా ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, రాజుపాలెం మండలం వైసిపి అధ్యక్షుడు రాజారాం రెడ్డి వైసిపి నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Read Also..