105
పాడేరు నుండి విజయవాడ కోర్టుకు వెళ్తుండగా నిన్న కత్తిపూడి రాజమండ్రి హైవే పై పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో రెండు టైర్లు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గిడ్డి ఈశ్వరి తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు, ఎవరికి ఎటువంటి గాయాలు తగలలేదు, అందరూ సేఫ్ గా ఉన్నారు. ఆ వాహనాన్ని ఆ సంఘటన స్థలానికి వదిలి వేరే వాహనంలో విజయవాడకు చేరుకున్నారు నేడు విజయవాడ కోర్టులో హాజరు కానున్నారు.
Read Also..