నేడు పాకిస్తాన్ లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు..

Advertisements

<p>పాకిస్థాన్‌లో అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెరపడింది&period; ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు చేరుకొంది&period; వీరికి పాక్‌ అధికారులు స్వాగతం పలికారు&period; ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ &comma; పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొననుంది&period; అయితే&comma; ముందస్తు షరతులకు యూఎస్ అంగీకరిస్తేనే&period;&period; చర్చలు ముందుకుసాగుతాయని ఇరాన్‌ మీడియా స్పష్టం చేసింది&period; రక్షణ మండలి కార్యదర్శి&comma; సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సహా పలువురు సీనియర్‌ రాజకీయ&comma; సైనిక నాయకులు కూడా ఈ బృందంలో ఉన్నారు&period; ఫ్లైట్‌ రాడర్‌24 ప్రకారం&period;&period; ఇరాన్‌ ప్రభుత్వానికి చెందిన రెండు విమానాలు ఇస్లామాబాద్‌లోని విమానాశ్రయంలో దిగాయని పేర్కొంది&period; ఇరాన్‌ ప్రతినిధుల రాకను పాక్‌ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది&period; పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌&comma; ఆ దేశ ఆర్మీచీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఇతర పాక్‌ అధికారులు వీరికి స్వాగతం పలికినట్లు తెలిపింది&period; ఇరాన్‌ ఇస్లామాబాద్‌కు చేరుకున్నప్పటికీ&period;&period; చర్చలు ముందుకుసాగేందుకు పలు షరతులు విధించింది&period; ఏ కాల్పుల విరమణ అయినా లెబనాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.