బీహార్ రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ప్రతిపాదించిన రిజర్వేషన్ సవరణ బిల్లును తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం నితీష్ కుమార్ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వడం విశేషం. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65శాతానికి పెరిగింది. అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమోదం పొందిన బిల్లు ప్రకారం. షెడ్యూల్డ్ కులాల వారికి 20 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కుతుంది. షెడ్యూల్డ్ తెగలు వారికి రెండు శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. కాగా ప్రస్తుతం ఓబీసీలకు 12 శాతం, ఈబీసీలకు 18 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. ఇక ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం..
76
previous post