63
విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగిందని…నవరత్నాలలో సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం 39.64 లక్షల మంది లబ్ధిదారులకు 6, 581 కోట్ల రూపాయల ఈ అక్టోబర్ నెలాఖరివరకు టారిఫ్ సబ్సిడీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇప్పటివరకు ఐదు లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఈ ఆర్ధిక సంవత్సరంలో అదనంగా నిర్ణీత కాలపరిమితిలో ఇవ్వడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
Read Also..