ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్స్ ను ఆదరిస్తూ ఎంతో మెడిసినల్ వేల్యూస్ ఉన్న ట్రేడిషినల్ పుడ్ దూరం చేసుకుంటున్నారని దానిని భవిష్యత్ తరాలకు అందించేందుకు జి.ఆర్.టి. హోటల్స్ పింక్ చెఫ్ సీజన్ టూ ఏర్పాటు చేసినట్లు సెలబ్రిటి చైఫ్ దాము, జి.ఆర్.టి. చీప్ చెఫ్ సీతారామ్ ప్రసాద్ జి.ఎం. శివకిరణ్ లు పేర్కోన్నారు. కాకినాడ రామారావుపేటలోగల గ్రాండ్ కాకినాడ బై జి.ఆర్.టి హోటల్లో ఆధ్వర్యంలో పింక్ చెఫ్ సీజన్ టూ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 60 మంది మహిళలు పాల్గొని వివిద రకాల ట్రెడిషినల్ ఫుడ్స్ ను ప్రదర్శించారు. సెలబ్రిటీ చెఫ్ దాము, చీఫ్ చెఫ్ సీతారామ్ ప్రసాద్, జి.ఎం. -శివకిరణ్ లు మహిళలు ప్రదర్శించిన వంటలకు న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సెలబ్రిటి చెఫ్ దాము, చీఫ్ చెఫ్ సీతారామ్ ప్రసాద్, శివకిరణ్ లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బాగంగా మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, జి.ఆర్.టి. సీబంది పాల్గొన్నారు.
పింక్ చెఫ్ సీజన్ టూ కార్యక్రమం..
58
previous post