రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న భూ బకాసురులు..

Advertisements

<p>రంగారెడ్డి జిల్లాలో అక్రమ వెంచర్లకు అంతే లేకుండా పోయింది&period; సీలింగ్‌ భూమి&comma; ప్రభుత్వ భూమి&comma; చెరువులు&comma; కుంటలు అన్న తేడా లేకుండా కంటికి కనిపించిన స్థలాలను కబ్జా చేసి&period;&period; వెంచర్లు వేసేస్తున్నారు&period; అరచేతిలో స్వర్గం సృష్టించి&comma; కల్లబొల్లి కబుర్లు చెప్పి అమాయకులకు ప్లాట్లు అమ్మేస్తున్నారు&period; ఇలా కొనుక్కున్న వారు ఆ తర్వాత జరిగే పరిణామాలకు తీవ్రంగా నష్టపోతున్నారు&period; మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు&comma; కడ్తాల్‌ మండలాల్లో ప్లానెట్‌ గ్రీన్‌&comma; పామ్ నాచురా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఇదే తరహాలో ప్రజలను బురిడీ కొట్టించాయి&period; యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి వందల కోట్లు స్వాహా చేశాయి&period;&period;<&sol;p>&NewLine;<p>రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలోని సర్వే నెంబర్లు 90 నుంచి 100&comma; 108 లో గల భూములను కేశంపేట్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి&&num;8230&semi; ఎన్నారైల డబ్బులతో కొనుగోలు చేశారు&period; అనంతరం వెంచర్ డెవలపింగ్ కంపెనీ అయినా ప్లానెట్ గ్రీన్ కు కొంత భూమిని అప్పగించారు&period; ఈ సంస్థ యజమాని వినయ్ రామ్ మరో అడుగు ముందుకేసి&period;&period; డెవలపింగ్ పేరుతో అక్కడ ఉన్న రెండు చెరువులను మూసివేసి ఫీడర్ ఛానళ్లను కబ్జా చేసి రోడ్లు వేశారు&period; అలాగే రెండు నియోజకవర్గాలు&comma; రెండు మండలాలు&comma; రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలోని అసైన్&comma; సీలింగ్ భూములను కబ్జా చేశారు&period; అంతేకాదు కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని సర్వే నెంబర్ 600 లో ఉన్న సీలింగ్‌ భూమిని కబ్జా చేసి అందులో నుంచి రోడ్డు వేశారు&period; అలాగే కడ్తాల్ మండలం రావిచెడ్‌ గ్రామం సర్వేనెంబర్ 108&sol;3 లోని అసైన్ భూమిని కూడా కబ్జా చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇదంతా రహస్యంగా&comma; గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారమేమీ కాదు&period; బహిరంగంగా అందరి కళ్ల ముందే జరుగుతున్న భారీ దోపిడీ&period; అయినా రెవెన్యూ అధికారులు గానీ ఇరిగేషన్ అధికారులు గానీ&comma; HMDA&comma; DTCP అధికారులు గానీ స్పందించడం లేదు&period; ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు&period; మరోవైపు చాలా ప్రాంతాల్లో ప్లానెట్‌ గ్రీన్‌ సంస్థ డెవలప్ చేసిన వెంచర్లకు కనీసం రోడ్డు మార్గం కూడా లేదు&period; ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న రియల్‌ ఎస్టేట్‌ యజమాన్యాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.