112
ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని నిపుణులంతా చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి తనకు అధికారం ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకు వెళ్లే పూచీ తనదని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ప్రధాని సుడిగాలి పర్యటన జరిపారు. బెటుల్, షాజపూర్, జబువా ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్కు చెందిన ఒక జ్ఞాని దేశంలోని ప్రజలంతా చైనా మొబైల్స్ వాడుతున్నారని చెప్పడం తాను విన్నానని, వీళ్లంతా ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియదని, వాస్తవాన్ని చూడలేని వాళ్లని మోదీ విమర్శించారు. మొబైళ్ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో పెద్ద దేశమని అన్నారు.