పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలి – రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; అత్యంత పారదర్శకంగా&comma; ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు&period; పోలీస్&comma; వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు&period; సెలక్షన్ ప్రక్రియలో ఉన్న లోపాలు&comma; పరిష్కారాలు&comma; రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన రిక్రూట్‌మెంట్లపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు&period; పోలీసు&comma; ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరిగా ఉత్తర&comma; దక్షిణ తెలంగాణల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; గత ఎనిమిదేళ్లుగా హోంగార్డు నియామకాలు లేవని పేర్కొన్న సీఎం&comma; వెంటనే నియామకాలు చేపట్టాలని కూడా ఆదేశించారు&period; హోం గార్డు సేవలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించాలని కూడా సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.