అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు, రాముని చిత్రపటం, కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి పంచుతున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లా అంతటా శ్రీరామచంద్ర స్వామి వారి అక్షితలు, చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అక్కిరెడ్డి అన్నారు. జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు, కళ్యాణాలు, హోమాలు, క్రతువులు నిర్వహించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. అదేవిధంగా 22వ తేదీ సాయంత్రం ప్రతి ఇంటి వద్ద కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతోందని అక్కిరెడ్డి సుబ్రమణ్యం తెలిపారు.
Read Also..