ఢిల్లీ బోర్డర్ లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు పండించే రైతులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని 25 రూపాయలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షలాది చెరకు పండించే రైతులకు మేలు చేకూరనుందని ప్రధాని ట్వీట్ చేశారు.
డ్రగ్స్ పట్టివేత.. మార్కెట్ విలువ రూ.2,200 కోట్లు
ఇక ఆందోళన చేస్తున్న రైతులను మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చర్చలకు ఆహ్వానించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సూచిస్తూ ఐదో విడత చర్చలకు పిలిచారు. రైతులపై నమోదైన కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించిన తర్వాతే మిగతా విషయాలపై చర్చిస్తామని రైతులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.