ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) :
సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కొనియాడారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం.
ఇది చదవండి: నేడు మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర..
మోదీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వం అని అభివర్ణించారు. అందుకే మోదీని మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కీర్తించారు. ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికే మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. పదేళ్లలో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన దార్శనికనేత నరేంద్ర మోదీ అని కొనియాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.