86
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు. నేడు ప్రియాంక గాంధీ ఖానాపూర్, అసిఫాబాద్‌ల పర్యటించనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి నాందేడ్ చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖానాపూర్ చేరుకుంటారు. ఇక్కడ గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసిఫాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు.