బాలికల పరిరక్షణ అందరి బాధ్యత..

National Girl Child Day

Advertisements

&NewLine;<p>బాలికల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అన్నారు&period; జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి డైట్ స్కూల్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండయ్య అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు&period; ఈ ర్యాలిలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు&period; ఈ ర్యాలి డైట్ స్కూల్ నుంచి నేతాజీ సర్కిల్ వరకు కొనసాగింది&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ&period;&period; బాలికా సంరక్షణతో పాటు సాధికారిత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు&period; రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు&period; ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు&period; బ్రూణ హత్యల నిరోధాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వ్యతిరేకించాలన్నారు&period; తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాలబాలికల మధ్య తేడాలు చూపవద్దన్నారు&period; చిన్నతనం నుంచే బాలికలకు అవకాశాలు కల్పించినపుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందన్నారు&period; ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు&period; ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య అధికారులు&comma; వైద్యులు&comma; సిబ్బంది&comma; ఇసిడీఎస్ ఇంచార్జి పిడి శశికళ తో పాటు డైట్ ఇంచార్జి ప్రిన్సిపాల్ శివ బాస్కర్&comma; డైట్ విద్యార్థినిలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..