పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..

Advertisements

<p>కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్&period;రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు&period; ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో&comma; కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు&period; దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు&period; మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16&period; ఏప్రిల్ 9à°¨ జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది&period; ఏఐఎన్ఆర్సీ పోటీ చేసిన 16 స్థానాల్లో 12 చోట్ల ఘన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది&period; బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలను గెలుచుకుంది&period; ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమైంది&period; ఇందులో డీఎంకే 5 స్థానాలను గెలుచుకోగా&comma; కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది&period; పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత సామాన్యుడిగా&comma; మృదుభాషిగా పేరున్న ఎన్&period; రంగస్వామికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు&period; గతంలో నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన&comma; ఇప్పుడు ఐదోసారి పగ్గాలు చేపట్టనున్నారు&period; ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమిలో సమన్వయం సాధిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపారు&period; త్వరలోనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరనున్నారు&period; దాంతో పుదుచ్చేరిలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరడం ఖాయమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..