మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ..

మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

Advertisements

<p>చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం&&num;8230&semi; FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం&period; కానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా&period;&period; అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్‌ లో జరిగిన ఈ ఘోరం చూడండి&period; కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న నస్పూర్ చెరువు 144 ఎకరాల్లో విస్తరించి ఉంది&period; ఇప్పటికే చెరువు చుట్టూ స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేశారు&period; తమ భూముల్లోకి నీరు రాకుండా ఎత్తుగా మట్టి పోశారు&period; అయితే ఎండాకాలం కావడంతో చెరువులో నీటి మట్టం తగ్గింది&period; ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు&period;&period; కట్టను చదును చేసి 10 గుంటల వరకు భూమిని ఆక్రమించారు&period; ఇలా గ్రీన్‌ సిటీ వైపున ఉన్న కట్ట మాయం కావడంతో&period;&period; ఇప్పుడు చుట్టుపక్కల కాలనీల్లో భయం మొదలైంది&period; వర్షకాలంలో చెరువు నిండితే ఆ నీరంతా తమ కాలనీలను ముంచెత్తుతుందని వారు ఆందోళన చెందుతున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>చెరువు శిఖం 126 సర్వే నెంబరులో ఉండగా అందులో 80 మీటర్ల పొడవున కట్టను చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేయడం వెనుక అధికారుల అండ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; ఇలాంటి కబ్జాలు జరిగినప్పుడో&comma; లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడో&&num;8230&semi; మొక్కుబడిగా రెవెన్యూ&comma; ఇరిగేషన్ శాఖల అధికారులు పరిశీలించి వెళ్లడం తప్ప తీసుకున్న చర్యలేమీ లేదు&period; దీంతో కబ్జాలు మరింతగా పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; చెరువు శిఖం భూమితోపాటు&comma; బఫర్ జోన్ నిబంధనలను పక్కనపెట్టి ఆక్రమణలు కొనసాగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది&period;&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి చెరువు శిఖం భూములను రక్షించాలని కబ్జా చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు&period; దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..